- రైలు టిక్కెట్లు అయిపోయాయి..! బస్సుల్లో చార్జీల బాదుడు..! సంక్రాంతికి ఊరెలా..!
BUS RESERVATIONS FULL : సంక్రాంతి పండుగకు రైల్లో సొంతూరు వెళ్దామనుకుంటున్నారా.. టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.. అయితే మీ ప్రయత్నం విరమించుకోవడం మంచిది. ఎందుకంటే మీ ఊరెళ్లే ఏ రైళ్లోనూ బెర్తులు ఖాళీగా లేవు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే రైళ్లన్నింటిలోనూ బెర్తులు నిండిపోయాయి. కనీసం టికెట్ బుక్ చేసుకునేందుకూ అవకాశం లేదు. రైల్వే శాఖ అరకొరగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఏపాటికీ సరిపోవడం లేదు.
- సరదారాయుళ్లు.. న్యూయర్ వేళ కాస్త తగ్గాలంటున్న ఏపీ పోలీసులు
Special Restrictions For New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏపీలోని ప్రధాన నగరాల్లో.. ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.. అతివేగం, ట్రిబుల్ రైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని ప్రకటించారు. మితిమీరిన ఆగడాలతో హద్దులు మీరితే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
- "అమ్మో! సీఎం జగన్ పర్యటనా.." హడలెత్తుతున్న ప్రజలు, ప్రతిపక్షాలు
Cm Jagan Anakapally Tour : ముఖ్యమంత్రి ఏదైనా ప్రాంతంలో పర్యటిస్తున్నాడు అంటే ముందస్తుగా.. ఆ ప్రాంత ప్రతి పక్షనాయకులను అదుపులోకి తీసుకోవటం మాములైపోయింది. సీఎం పర్యటన అంటే హంగులు, ఆర్భాటలే కాకుండా.. ఆర్టీసీ బస్సులను సభ కోసం తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు దీని వల్ల సమస్యలు ఎదుర్కోంటున్నారు.
- స్మార్ట్‌మీటర్లపై ఎందుకంత ప్రేమ.. కేంద్రం వద్దన్నా టెండర్లు..!
Tenders for Manufacture of Smart Meters: ఎన్ని విమర్శలైనా రానీయండి.. అసలు పట్టించుకోరు. అక్రమాలను ఆధారాలతో సహా బయటపట్టినా స్పందించరు. పైగా ఎదురుదాడి వ్యూహం చేపడతారు.. తాజాగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపైనా వైసీపీ ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తోంది. అసలు మోటార్లకు మీటర్లు అక్కర్లేదని కేంద్రప్రభుత్వమే చెప్పినా.. ఫీడర్ల స్థాయిలో ఏర్పాటుచేస్తే చాలని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టంచేసినా.
- నగర పంచాయితీ ఎన్నికల్లో 'మెడికో' సత్తా.. మాజీ ఎంపీ భార్యపై విజయం.. 21 ఏళ్లకే చీఫ్ కౌన్సిలర్‌గా..
బిహార్ నగర పంచాయితీ ఎన్నికల్లో 21 ఏళ్ల ఓ వైద్య విద్యార్థిని సత్తా చాటింది. ఎంపీ భార్యతో సహా మరికొందరు సీనియర్ నాయకులతో పోటీ పడి మరీ.. 2193 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఆ యువతి సాధించిన విజయం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
- న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. రూ. 6 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్న 10మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 6 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.
- జిన్‌పింగ్‌తో పుతిన్ వీడియో కాన్ఫరెన్స్.. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం..!
China Russia Relations 2022 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆంతరంగిక చర్చలు చేపట్టారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత దృఢపరచుకొంటామని ఇరువురు శుక్రవారం ప్రకటించారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- యుగానికి ఒక్కడు ఈ 'పీలే'.. ఆ ఘనతలన్నీ అతనికే సొంతం
అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించిన దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే.. గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్లో పీలే సాధించిన ఘనతుల, రికార్డులు తెలుసుకోవడం సహా అతడు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
- నటి పవిత్రతో పెళ్లి.. లిప్ కిస్‌తో కన్ఫామ్ చేసిన నరేశ్
సామాజిక మాద్యమాల్లో తమపై వస్తున్న విమర్శలకు సీనియర్ నటుడు నరేష్, పవిత్రలు ముగింపు పలికారు. త్వరలోనే తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నటుడు నరేష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తమ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.