ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @7PM - AP LATEST NEWS

ఏపీ ప్రధాన వార్తలు

TOPNEWS
TOPNEWS

By

Published : Dec 17, 2022, 6:59 PM IST

  • దేశ రాజధానిలో అమరావతి రైతుల నిరసన.. మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులు
    AMARAVATI FARMERS PROTEST : అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ ఆ ప్రాంత రైతులు దేశ రాజధాని దిల్లీలో నిరసన చేపట్టారు. ‘ధరణికోట నుంచి ఎర్రకోట’ అనే నినాదంతో ధర్నాకు దిగారు. రైతుల నిరసనలకు పలు జాతీయ పార్టీల నాయకులు తమ మద్దతు తెలిపారు. అమరావతే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందని ఏకకంఠంతో స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • “లైఫ్‌ స్కిల్స్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌” పుస్తకాన్ని ఆవిష్కరించిన నారాయణ మూర్తి
    Life Skills and Human Development book: విద్యార్థుల సమగ్ర వికాసానికి జీవిత నైపుణ్యాలు చాలా అవసరమని.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు శ్రీ ఎన్.ఆర్.నారాయణ మూర్తి అన్నారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వీ కృష్ణ మోహన్‌, ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్‌ స్కిల్స్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ సంయుక్తంగా రచించిన “లైఫ్‌ స్కిల్స్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌” పుస్తకాన్ని ఆయన విడుదల నారాయణ మూర్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐడియా అదిరింది.. దళితుల భూములు లాక్కుని వారికే ఇళ్ల పట్టాలు ఇస్తున్న వైసీపీ నేతలు
    YSRCP vote bank politics: దశాబ్దాల క్రితం దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై వైకాపా నేతల కన్నుపడింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారిని బెదిరించో, బుజ్జగించో కోట్ల రూపాయల విలువైన భూములను కాజేందుకు వైకాపా నేతలు రంగంలోకి దిగారు. ఇళ్లపట్టాలుగా మార్చి ఇస్తామంటూ లేఅవుట్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పొట్టి శ్రీరాములు ఆశయాలను స్మరిస్తూ.. నటుడు సాయిచంద్​ కాలినడక దీక్ష
    Actor Sai Chand : పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తు చేస్తూ.. నటుడు సాయిచంద్​ కాలినడక దీక్షను ప్రారంభించారు. చైన్నై నుంచి ప్రకాశం జిల్లా పడమటి పల్లె వరకు ఈ యాత్ర కొనసాగనుంది. దీనిపై మాజీ ఉపసభాపతి మండలి బుద్థప్రసాద్ ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'శ్రద్ధా వాకర్' తరహా దారుణం.. మేనత్తను చంపి.. శవాన్ని పది ముక్కలుగా నరికి..
    యావత్​ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్​ హత్య తరహా దారుణం రాజస్థాన్​లో వెలుగు చూసింది. తన పనులకు అడ్డు వస్తోందని ఓ వ్యక్తి.. తన మేనత్తను సుత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పది ముక్కలుగా నరికి అడవిలో పాతిపెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'బిహార్ కల్తీ మద్యానికి 200 మంది బలి'.. ఆ పోలీస్ స్టేషన్ నుంచే 'సారా' లీక్!
    బిహార్​లో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 73కు పెరిగింది. అయితే, మరణాలపై ప్రభుత్వం వాస్తవాలు దాచేస్తోందని చిరాగ్ పాసవాన్ ఆరోపించారు. ఇప్పటివరకు 200 మంది చనిపోయారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'టార్గెట్ కీవ్'.. ఉక్రెయిన్​పై దాడికి రష్యా నయా ప్లాన్.. ఆ దేశం నుంచి యుద్ధం!
    వచ్చే ఏడాది ప్రారంభంలో రష్యా మరోసారి భారీ దాడులకు దిగే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అనుమానిస్తోంది. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ దాడులకు తెగబడే ప్రమాదం ఉందని భావిస్తోంది. కొన్నిరోజులుగా ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను తగ్గించిన మాస్కో శుక్రవారం మరోసారి విరుచుకుపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్తి తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారా?.. వీటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే!
    కలలను సాకారం చేసుకునేందుకు మనం పొదుపు చేసిన డబ్బు సరిపోకపోవచ్చు. అయితే అలాంటి సందర్భాలలో ఆస్తి తనఖా పెట్టి రుణాలను తీసుకోవడం అనివార్యం కావచ్చు. అయితే ఈ తరహా రుణాలను తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించడం తప్పనిసరి. మరి ఆ అంశాలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND VS BAN: ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి చేరువలో టీమ్ఇండియా
    భారత్‌ బౌలర్లు రాణించడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా తడబాటుకు గురైంది. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువగా వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టేజ్​పై కన్నీళ్లు పెట్టుకున్న ఆ స్టార్​ హీరో.. స్పందించిన సల్మాన్​ ఖాన్​
    ఓ స్టార్ హీరో స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో వైరల్​ అవ్వగా.. దానిపై మరో అగ్రకథానాయకుడు సల్మాన్​ ఖాన్ స్పందించారు. ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details