ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - AP LATEST NEWS

.

TOP NEWS 5PM
TOP NEWS 5PM

By

Published : Nov 6, 2022, 5:01 PM IST

  • మునుగోడు ఉప ఎన్నిక.. తెరాస జోరు.. విజయం దిశగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
    తెలంగాణలో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో.. అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ జరిగిన పదమూడు రౌండ్లలో 2, 3 మినహా మిగతా అన్నింట్లో గులాబీ పార్టీ మెజారిటీ సాధించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గ్రామ సౌకర్యాలపై ప్రశ్నించిన జవాన్​పై ఎమ్మెల్యే కేతిరెడ్డి అసహనం.. వీడియో వైరల్​
    ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుడ్​మార్నింగ్​ కార్యాక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లాలోని గొట్లూరు గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేని ఓ ఆర్మీజవాన్​ నిలదీశారు. దీంతో కేతిరెడ్డి అసహనానికి గురైయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కష్టం కలిసి రాక.. అప్పులు తీర్చలేక.. పల్లెలు విడిచి
    వర్షాలు దండిగా పడితే.. వాగులు, వంకలు నిండితే.. అందరి కంటే ముందుగా సంబరపడేది రైతన్నలే. అవే వానలు.. పంట చేతికి వచ్చే సమయానికి దంచి కొడితే.. నష్టపోయి అప్పులో నిండా మునిగేది.. అన్నదాతలే. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురుకావడంతో.. పండుటాకులైన కన్నవారిని వదిలి, బడికెళ్లే కన్నబిడ్డల్ని వెంటేసుకుని వలస బాట పడుతున్నారు.. కర్నూలు జిల్లా రైతులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 12న విశాఖకు ప్రధాని.. 11న నిరసనలకు ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపు
    ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి మెదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో.. 11వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు.. విశాఖ ఉక్కు పరిరక్షణ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్​ప్లాంట్​ అమ్మడాన్ని ఆపాలని కోరారు. విశాఖ స్టీల్​ప్లాంట్ పరిరక్షణ కోసం గత 632 రోజుల నుంచి నిరసనలు చేస్తునట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉపఎన్నికల్లో సత్తా చాటిన భాజపా.. పట్టు నిలుపుకున్న ఆర్జేడీ, శివసేన
    దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భాజపా మూడు స్థానాలు గెలుచుకుని మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) చెరొక స్థానాన్ని గెలుచుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కుటుంబంలోని నలుగురిని హత్య​ చేసిన బాలుడు​.. అంతు చిక్కని కారణం!
    13 ఏళ్ల బాలుడు తన కుటుంబంరలోని నలుగురిని హత్య చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలించి పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాతావరణ మార్పులను ఈసారైనా 'కాప్‌' కాస్తారా?
    ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లలో వాతావరణల మార్పులు ఒకటి. ఈ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు అధికమవుతున్నాయి. వీటిని అధిగమించడంపై ఈజిప్ట్​లో కాప్​-27 సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు బైడెన్‌ సహా అనేకమంది దేశాధినేతల హాజరు కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • '8 డాలర్లకే బ్లూటిక్​' సేవలు ప్రారంభం .. త్వరలోనే భారత్​లో సైతం..!
    ట్విట్టర్​ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్​.. అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్​ సబ్​స్క్రిప్షన్​ను 7.99 డాలర్లకు అందించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హాఫ్​ సెంచరీలతో అదరగొట్టిన సూర్య, రాహుల్​.​. జింబాబ్వే టార్గెట్​ ఎంతంటే?
    T20 World Cup Ind Vs Zim: టీ20 ప్రపంచకప్​లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్​లో భారత క్రికెట్​ జట్టు 186 పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టుకు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఒకప్పుడు సౌత్​ సినిమాలు చూసి ఉత్తరాది వాళ్లు ఎగతాళి చూసేవారు.. రాను రాను వాళ్లే..'
    'కేజీయఫ్‌'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్‌.. దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఉత్తరాది వాళ్లు.. సౌత్​ చిత్రాలు చూసి ఎగతాళి చేసేవారని తెలిపారు. రాను రాను వాళ్లే తమ సినిమాల్లోని కళను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారని అన్నారు. ఇంకేమన్నారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details