ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tomato Price: చుక్కల్లో టమాటా ధర.. మదనపల్లె మార్కెట్లో ఎంతంటే..​ - ఏపీలో టామాటా ధర

Tomato Market Price: రాష్ట్రంలో టమాటా ధర ఒక్కసారిగా కిలో 80 రూపాయలకు చేరుకుంది. టమాటా ధరలో భారీగా పెరుగుదల నమోదు కావటంతో.. వినియోగాదారులకు అందని ద్రాక్షలా మారిపోయింది. అమాంతం పెరిగిన టమాటా ధర తగ్గుతుందోమోనని ఆశతో కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.

Tomato Price
టామాట ధర

By

Published : Jun 27, 2023, 1:25 PM IST

Updated : Jun 27, 2023, 4:49 PM IST

Tomato Price In Madanapalle Market: రాష్ట్రంలో ఒక్కసారిగా టమాటా ధరలు పెరిగిపోయాయి. గత వారం రోజుల క్రితం కిలో టమాటా ధర 20 నుంచి 30 రూపాయలు ఉండగా.. ఇప్పుడు మాత్రం కనిష్ఠంగా 50 రూపాయలు కాగా, గరిష్ఠంగా 80 రూపాయలు ఉంది. దీంతో సామాన్యులు కూరగాయల కొనే పరిస్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధర వల్ల కిలో అవసరం ఉన్న సమయంలో అరకిలో కొనుక్కుంటున్నామని కొనుగోలుదారులు వాపోతున్నారు.

అమాంతంగా పెరిగిన టమాటా ధరలను గమనిస్తే..మదనపల్లె వ్యవసాయ మార్కెట్​ గడిచిన నాలుగు రోజులుగా టమాటా ధర పెరుగుతూ వస్తోంది. పదికిలోల 1వ రకం టమాటాకు 26 వ తేదీన గరిష్ఠంగా 760 రూపాయలు పలికింది. 23వ తేదీన అదే పది కిలోల టమాటా ధర 460 రూపాయలు ఉంది. వాతావరణంలోని మార్పుల కారణంగా టమాటా లభ్యత లేదని, ఫలితంగా ధరల్లో వ్యత్యాసం ఉందని వ్యాపారులు అంటున్నారు.

మదనపల్లె మార్కెట్​ యార్డులోని టమాటా వివరాలు : మదనపల్లె వ్యవసాయ మార్కెట్​ యార్డులో టమాటా లభ్యతలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా గమనిస్తే.. సుమారు గరిష్టంగా 23వ తేదీన 1100 మెట్రిక్​ టన్నుల టమాటా మార్కెట్​కు అమ్మకానికి రాగా.. 25వ తేదీన కనిష్ఠంగా 900 మెట్రిక్​ టన్నులు విక్రయానికి వచ్చింది. మార్కెట్​కు విక్రయానికి వచ్చిన టమాటా ధర, లభ్యత వివరాలు కింద తెలిపిన విధంగా ఉన్నాయి.

  • ​23/06/2023 తేదీ
10 కేజీల టమాటా ధరకనిష్ఠ ధరగరిష్ఠ ధరమోడల్​ ధర
1వ రకం 340.00 రూ. 460.00రూ. 420.00రూ.
2వ రకం 240 .00రూ. 330.00రూ. 290.00రూ.
మార్కెట్​కు అమ్మకానికి వచ్చిన మొత్తం టమాటా 1106 మెట్రిక్ టన్నులు
  • ​24/06/2023తేదీ
10 కేజీల టమాటా ధరకనిష్ఠ ధరగరిష్ఠ ధరమోడల్​ ధర
1వ రకం 510.00 రూ. 580.00రూ. 560.00రూ.
2వ రకం 300.00రూ. 500.00రూ. 420.00రూ.
మార్కెట్​కు అమ్మకానికి వచ్చిన మొత్తం టమాటా 970 మెట్రిక్ టన్నులు
​10 కేజీల టమాటా ధరకనిష్ఠ ధరగరిష్ఠ ధరమోడల్​ ధర
1వ రకం 690.00 రూ. 800.00రూ. 760.00రూ.
2వ రకం 400.00రూ. 680.00రూ. 600.00రూ.
మార్కెట్​కు అమ్మకానికి వచ్చిన మొత్తం టమాటా 933 మెట్రిక్ టన్నులు
  • ​26/06/2023 తేదీ
10 కేజీల టమాటా ధరకనిష్ఠ ధరగరిష్ఠ ధరమోడల్​ ధర
1వ రకం 540.00 రూ. 760.00రూ. 700.00రూ.
2వ రకం 330 .00రూ. 520.00రూ. 480.00రూ.
మార్కెట్​కు అమ్మకానికి వచ్చిన మొత్తం టమాటా 997 మెట్రిక్ టన్నులు
Last Updated : Jun 27, 2023, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details