ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపటినుంచే మన ఎయిమ్స్​లో చికిత్స! - మంగళగిరి ఎయిమ్స్

మంగళగిరి ఎయిమ్స్.. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రేపటినుంచే 12 విభాగాల్లో చికిత్స అందనుంది. రాయితీపై మందులను అందించే సౌకర్యాన్నీ కల్పించారు.

మంగళగిరి ఎయిమ్స్

By

Published : Mar 11, 2019, 5:41 PM IST

Updated : Mar 11, 2019, 6:42 PM IST

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం హామీల్లో ఒకటైన మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)... రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్థలో వైద్య సేవలు మంగళవారం అందుబాటులోకి రానున్నాయి. ఔట్ పేషంట్ (ఓపీడీ) విభాగంలో చికిత్స ప్రారంభిస్తున్నామని.. 12 విభాగాల్లో ఓపీడీ సేవలు అందిస్తామని మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్ రాజేష్ కక్కర్ తెలిపారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు 70 శాతం రాయితీతో అమృత్ ఫార్మసీ ద్వారా మందులు ఇప్పించే ఏర్పాటు చేశామన్నారు. దశల వారీగా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఎయిమ్స్

రూ.1680 కోట్ల వ్యయంతో..

గుంటూరు జిల్లా మంగళగిరిలో.. 1680 కోట్ల వ్యయంతో ఎయిమ్స్​ను నిర్మిస్తున్నారు. 183 ఎకరాల్లో... రెండు దశల్లో నిర్మాణ పనులు చేస్తున్నారు. తొలిదశ పనులు ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తికానున్నాయి.

ఇదీ చదవండి:

'తెదేపాను ఎదుర్కొలేకే కుట్రలు'

Last Updated : Mar 11, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details