అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని.. రాజధాని పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ చెప్పారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు వైకాపా ప్రభుత్వం పన్నిన కుట్రలన్నీ న్యాయస్థానంలో ఓడిపోయాయన్నారు. భూసమీకరణలో, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చేసిన.. ఆరోపణలలో ఎలాంటి వాస్తవాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. రైతులు తమ అవసరాల కోసమే భూములు అమ్ముకున్నారే తప్ప ఎలాంటి అక్రమ.. క్రయ విక్రయాలు జరగలేదని స్పష్టం చేశారు. దీనిపై చర్చించేందుకు సిద్ధమన్నారు. అమరావతి రాజధానితో ఏయే జిల్లాకు ఎలాంటి అభివృద్ధి అవసరమో వివరిస్తామని స్పష్టం చేశారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 582వ రోజు ఆందోళనలు చేశారు. వర్షం పడుతున్నా.. రైతులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు తెలిపారు.
amaravathi: 582వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం.. - గుంటూరు తాజా సమాచారం
అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాజధాని పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన నేటికి 582వ రోజుకు చేరింది.
అమరావతి రైతుల ఉద్యమం