CORONA CASES IN AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 57 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 507 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,594 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
Covid Cases In India: భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 2,539 మందికి వైరస్ సోకింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,491 వైరస్ను జయించారు.
మొత్తం కేసులు: 4,30,01,477
మొత్తం మరణాలు: 5,16,132
యాక్టివ్ కేసులు: 30,799