ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Covid Cases in AP: రాష్ట్రంలో కొత్తగా 1,891 కరోనా కేసులు.. 5 మరణాలు - AP Latest Corona bulletin

today corona bulletin
today corona bulletin

By

Published : Feb 8, 2022, 5:22 PM IST

Updated : Feb 8, 2022, 5:40 PM IST

17:11 February 08

రాష్ట్రంలో కొత్తగా 1,891 కరోనా కేసులు, 5 మరణాలు

AP corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,236 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,891 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి నిన్న 10,241 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54,040 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 5 మంది మరణించినట్లు పేర్కొంది.

దేశంలో సైతం తగ్గిన కొవిడ్​ కేసులు..

Covid Cases in India: భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 13,46,534 పరీక్షల్లో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,118మంది మరణించారు. 1,80,456 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు:4,23,39,611
  • మొత్తం మరణాలు:5,04,062
  • యాక్టివ్ కేసులు:9,94,891
  • మొత్తం కోలుకున్నవారు:4,08,40,658

దేశంలో కొత్తగా 55,78,297 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,70,21,72,615 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి కాస్తా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 18 లక్షల మందికి కరోనా సోకింది. 8,126 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.80 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,68,460కు పెరిగింది.

  • రష్యాలో కొత్తగా 1.71 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 609 మంది మరణించారు.
  • అమెరికాలో మరో 1.56 లక్షల మందికి కొవిడ్ సోకింది. 1,269 మంది చనిపోయారు.
  • జర్మనీలో కొత్తగా 1.38 లక్షల మందికి వైరస్​ సోకగా.. 129 మంది మృత్యువాత పడ్డారు.
  • టర్కీలో తాజాగా 96 వేలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 236 మంది బలయ్యారు.
  • జపాన్​​లో ఒక్కరోజే దాదాపు 92 వేల మందికి వైరస్ సోకింది. మరో 62 మంది మృతి చెందారు.


ఇదీ చదవండి:DH on Corona Third Wave: 'కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది.. ఎలాంటి ఆంక్షల్లేవు'

Last Updated : Feb 8, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details