ap corona cases today: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,561 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి నిన్న 8,742 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 12 మంది కొవిడ్ బారినపడి మరణించినట్లు తెలిపారు.
దేశంలో..
Corona cases in India: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో.. 2,51,209 కేసులు నమోదయ్యాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. వైరస్‌తో మరో 627 మంది మరణించారు. 3,47,443 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,06,22,709
- మొత్తం మరణాలు:4,92,327
- యాక్టివ్ కేసులు:21,05,611
- మొత్తం కోలుకున్నవారు:3,80,24,771