ap corona cases today: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదేసమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి నిన్న 10,290 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 9 మంది మరణించినట్లు తెలిపారు.
దేశంలో..
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,03,71,500
- మొత్తం మరణాలు:4,91,700
- యాక్టివ్ కేసులు:22,02,472
- మొత్తం కోలుకున్నవారు:3,76,77,328