ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లతో రైతులకు మంచి ధర' - ఏపీ మార్కెటింగ్ శాఖ వార్తలు

మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ అమలు చేస్తామన్నారు.

tobacco board meeting
tobacco board meeting

By

Published : Jul 14, 2020, 3:24 PM IST

మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ మొదలయ్యాక రైతులకు మంచి ధర లభిస్తోందని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు కొనుగోళ్ల తీరుపై సమీక్షించారు. గతంతో పోలిస్తే పొగాకుకు మంచి ధర లభిస్తోందని.. మార్క్ ఫెడ్ రంగంలోకి దిగటమే దీనికి కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ అమలు చేయాలని అక్కడి నుంచి వచ్చిన రైతులు అధికారుల్ని కోరారు. వారంలో అక్కడ కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఇవాళ్టి సమావేశంలో నిర్ణయించినట్లు ప్రద్యుమ్న తెలిపారు. ఇప్పటి వరకూ మార్క్ ఫెడ్ ద్వారా 1.4 మిలియన్ కిలోల పొగాకును కొన్నట్టు పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు వెల్లడించారు.

అన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు మొదలుపెడితే రైతులకు మరింత ప్రయోజనం కలగనుందని అభిప్రాయపడ్డారు. పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, ఇతర అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, పొగాకు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ముదిరిన 'రాజస్థాన్​' సంక్షోభం.. గహ్లోత్​ నిలిచేనా?

ABOUT THE AUTHOR

...view details