కర్ణాటకలో 2020-21 సంవత్సరానికి పొగాకు ఉత్పత్తిని 99 నుంచి 88 మిలియన్ కేజీలకు తగ్గించారు. గుంటూరులో సమావేశమైన పొగాకు బోర్డు 150వ పాలకవర్గ సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించాలని రైతులు, రైతు ప్రతినిధులు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో మొదలవనున్న పొగాకు కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు సభ్యులు సూచించారు. సమావేశంలో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు, ఈడీ సునీత, కార్యదర్శి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కరోనా ఎఫెక్ట్.. పొగాకు ఉత్పత్తి 88 మిలియన్ కేజీలకు కుదింపు
కర్ణాటకలో 2020 - 21 సంవత్సరానికి పొగాకు ఉత్పత్తిని 88 మిలియన్ కేజీలకు తగ్గిస్తూ పొగాకు బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించాలని రైతులు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రకటన చేశారు.
గుంటూరులో పొగాకు బోర్డు సమావేశం