పొగాకు బోర్డు పాలక మండలి సమావేశం ఈనెల 5వ తేదీన జరగనుంది. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబుతో పాటు పాలకమండలి సభ్యులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొంటారు. ఈ సీజన్లో పొగాకు విస్తీర్ణం ఎంత ఉండాలనేది సమావేశంలో ఖరారు చేయనున్నారు. గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గించే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ ఎగుమతులు, కొనుగోళ్లలో వచ్చిన తగ్గుదల కారణంగా పొగాకు మిగిలిపోకుండా ఉండాలంటే సాగు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ తరపున కూడా పొగాకు కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయనే దానిపైనా సమావేశంలో సమీక్షించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.