ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొగాకు పొలాలను సందర్శించిన టొబాకో బోర్డు ఛైర్మన్ - పొగాకు పంట సాగుచేస్తున్న జీపీఐ కంపెనీ

యాంత్రిక పద్దతుల ద్వారా జీపీఐ కంపెనీ సాగుచేస్తున్న పొగాకు పొలాలను టొబాకో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘనాథ్​బాబు, ఇతర అధికారులు సందర్శించారు.

Tobacco Board Chairman Yedlapati Raghanath Babu visited the tobacco farms.
పొగాకు పొలాలను సందర్శించిన టొబాకో బోర్డు ఛైర్మన్

By

Published : Feb 23, 2021, 8:17 PM IST


గుంటూరు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని జీపీఐ కంపెనీ పొగాకు పొలాలను టొబాకో బోర్డు ఛైర్మన్ శ్రీ యడ్లపాటి రఘునాథబాబు, బోర్డు అధికారులు, జీపీఐ కంపెనీ వారు సందర్శించారు. యాంత్రిక పద్ధతుల ద్వారాసాగు చేయటాన్ని వీక్షించారు. రైతుల అభ్యున్నతికి జీపీఐ కంపెనీ చేపడుతున్న కార్యక్రమాలను చూసి అభినందించారు.

పొగాకు ఎక్కువగా వ్యవసాయ కార్మిక ఆధారిత పంట కావున ఈ యాంత్రీకరణ పద్ధతుల ద్వారా కూలీల కొరతను తగ్గించవచ్చని బోర్డు ఛైర్మన్ రఘనాథ్​బాబు తెలిపారు. ఆర్వో ప్లాంట్, మెడికల్ క్యాంప్, పాఠశాలల అభివృద్ధి, మహిళా సాధికారిత వంటి ఎన్నో సదుపాయాలు నిత్యం రైతులు ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు జీపీఐ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details