ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దేశీయ మార్కెట్లోకి రానున్న గుంటూరు మిర్చి యార్డు కారంపొడి

By

Published : Nov 6, 2020, 10:52 AM IST

దేశీయ మార్కెట్లో కారం పొడికి ఉన్న డిమాండ్​ను అందిపుచ్చుకునేందుకు గుంటూరు మిర్చి యార్డు సిద్ధమవుతోంది. కేరళ సహా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న గిరాకీ దృష్ట్యా కారంపొడి సరఫరాకు నిర్ణయం తీసుకున్నామని యార్డు చైర్మన్​ చెప్పారు.

guntur mirchi yard
గుంటూరు మిర్చి యార్డు

రైతులకు, వ్యాపారులకు మధ్య సౌకర్యం కల్పించటానికే పరిమితమైన గుంటూరు మిర్చి యార్డు వ్యాపార ధోరణి వైపు ఆలోచిస్తుంది. మార్కెట్లో కారంపొడికి ఉన్న గిరాకీకి తగ్గట్టు దేశవ్యాప్తంగా నాణ్యమైన సరకు రవాణా చేయాలని నిర్ణయించారు. దీనివల్ల రైతులు పండించిన పంటకు మంచి ధర వచ్చే అవకాశాలుంటాయని ఆయన అన్నారు. రైలు మార్గాల ద్వారా ఎక్కువ మొత్తంలో రవాణా చేయవచ్చని... ఛార్జీలు కూడా తగ్గుతాయని తెలిపారు. పాలకవర్గ సమావేశంలో దీనిపై చర్చించామని వివరించారు.

పొగాకు రీసెర్చ్​ సెంటర్ (సీటీఆర్​ఐ) ​కు సంబంధించి అరవై ఎకరాల భూమి ఉందని..వ్యవసాయశాఖను సంప్రదించి దానిని తీసుకోవాలని యోచిస్తున్నట్లు యార్డు చైర్మన్ చెప్పారు. ఇందుకోసం సీటీఆర్ఐ చైర్మన్​ను సంప్రదించినట్లు తెలిపారు. ​ఆ ప్రాంతంలో పూలు, పండ్లు, కూరగాయల మార్కెట్​ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. హైదరాబాద్​లోని గడ్డి అన్నారం, ముంబయిలో వంటి వ్యవసాయ మార్కెట్లలాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'ఏపీలో నివసించే నిర్మాతలకే స్టూడియో భూములను కేటాయించాలి'

ABOUT THE AUTHOR

...view details