ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహాత్మాగాంధీ పిలుపు మేరకే సీఏఏ' - కన్నా లక్షీనారాయణ తాజా న్యూస్

దేశ విభజన సమయంలో మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు... ప్రధాని మోదీ సీఏఏను తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏకు మద్దతుగా గుంటూరులో జరిగిన తిరంగ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/27-December-2019/5510147_kanna.mp4
సీఏఏ చట్టానికి మద్దతుగా గుంటూరులో తిరంగా ర్యాలీ

By

Published : Dec 27, 2019, 7:15 PM IST

సీఏఏ చట్టానికి మద్దతుగా గుంటూరులో తిరంగా ర్యాలీ

కేంద్రం తెచ్చిన సీఏఏకు మద్దతుగా గుంటూరులో తిరంగ ర్యాలీ నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ ర్యాలీలో పాల్గొని... అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశ విభజన సమయంలో మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన మేరకే ప్రధాని మోదీ సీఏఏను తీసుకొచ్చారని తెలిపారు. ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పిన ఆయన... దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అవాస్తవ ప్రచారాలకు భయపడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు రాజకీయ దురుద్దేశంతోనే దేశాన్ని హింసకు గురి చేసే పరిస్థితికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details