పేదలకు ఇళ్ల పంపిణీలో అర్హులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని.. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి, నవులూరులో నిర్మించిన దాదాపు 500 మందికి టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ కాగితాలను అందజేశారు. పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వినూత్నంగా నిర్వహించారు. ముఖ్య అతిథులగా ప్రభుత్వ పాఠశాల పిల్లలను ఆహ్వానించారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి విద్యార్థులతోనే పట్టాలు ఇప్పించారు. ఇళ్లు రానివారు వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు.
మంగళగిరి, నవులూరులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం - మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి
అర్హులైన పేదలందరికీ ఇళ్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారని.. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి, నవులూరులో నిర్మించిన దాదాపు 500 మందికి టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ కాగితాలను లబ్దిదారులకు అందజేశారు.
![మంగళగిరి, నవులూరులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం TIDCO Houses Distribution Programme conducted in Mangalagiri and Navalur at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10095565-661-10095565-1609592203792.jpg)
మంగళగిరి, నవులూరులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం