మందడం హై సెక్యూరీటి జోన్ అయిన కారణంగానే.. భద్రత నిమిత్తం డ్రోన్‌ను ప్రయోగించామని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. డ్రోన్ వినియోగించడాన్ని అడ్డుకున్న జేఏసీ నేత సుధాకర్ పై పోలిసులు దాడి చేశారనే ఆరోపణలపై స్పందించారు. రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తున్న కారణంగానే వాహనాలను నిలువరించామని.. భద్రత కోసమే అలా చేశామన్నారు. తన ఆదేశానుసారమే కానిస్టేబుళ్లు డ్రోన్ ను ఉపయోగించారని తెలిపారు. డ్రోన్ ను ఇళ్లపై తిప్పి మహిళలు స్నానం చేస్తుండగా చిత్రీకరించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
'భద్రత కోసమే డ్రోన్ ప్రయోగం.. మరో ఉద్దేశం లేదు' - డ్రోన్ ఘటనపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వివరణ
మందడంలో నిన్న జరిగిన డ్రోన్ ఘటనపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. రైతులు రోడ్డుపై ధర్నా చేస్తుండటం వల్లే డ్రోన్‌తో చిత్రీకరించాం తప్ప... అందులో మరో ఉద్దేశం లేదన్నారు. మహిళ స్నానం చేస్తుంటే దృశ్యాలు తీశారన్నది అవాస్తమన్నారు.
!['భద్రత కోసమే డ్రోన్ ప్రయోగం.. మరో ఉద్దేశం లేదు' thulluru dsp srinivas respond on Mandadam drone issue in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6161557-157-6161557-1582343204780.jpg)
'డ్రోన్ ప్రయోగం సెక్యూరీటీ కోసమే.. మరో ఉద్దేశం లేదు'
'డ్రోన్ ప్రయోగం సెక్యూరీటీ కోసమే.. మరో ఉద్దేశం లేదు'
ఇదీ చదవండి: