ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని మార్పును సహించేది లేదు: తులసీరెడ్డి - పీసీసీ ఉపాధ్యక్షులు తులసీరెడ్డి వార్తలు

రాజధాని మార్పు చేసి మహ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోయాడని... ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చిందని పీసీసీ ఉపాధ్యక్షులు తులసీరెడ్డి పేర్కొన్నారు

Thulasi Reddy participated in a farmers'   protest held at  Penumaka  in guntur
రైతులతో ధర్నాచేస్తున్నపీసీసీ ఉపాధ్యక్షులు తులసీరెడ్డి

By

Published : Dec 26, 2019, 3:45 PM IST

రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు నిర్వహించిన ధర్నాలో తులసీరెడ్డి పాల్గొన్నారు. రైతులు చేస్తున్న దీక్షకు తులసీరెడ్డి మద్దతు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలిస్తే... ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని పీసీసీ ఉపాధ్యక్షులు తులసీరెడ్డి స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రభుత్వం గుర్తించిందని గుర్తుచేశారు. ప్రధాని అమరావతిలో శంకుస్థాపన చేశారని.. అలాంటిదానిని వేరే ప్రాంతానికి మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

రాజధాని మార్పును సహించేది లేదు: తులసీరెడ్డి

ABOUT THE AUTHOR

...view details