గుంటూరు శివారు రెడ్డిపాలెంలో నిద్రిస్తున్న వృద్ధునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న చిన సాంబయ్య అనే వ్యక్తిని దిండుతో అదిమి చంపేందుకు యత్నించారు. బాధితుడు ప్రాణ భయంతో కేకలు వేయటంతో... చుట్టు పక్కల వారు కాపాడారు. గాయపడిన అతన్ని చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు అనుమానితులను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రిస్తున్న వృద్ధునిపై దుండగుల దాడి - గుంటూరులో వృద్ధునిపై గుర్తు తెలియని వ్యక్తల దాడి న్యూస్
నిద్రిస్తున్న వృద్ధున్ని హత్య చేసేందుకు యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. బాధితుడి కేకలు విని స్థానికులు రావటంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన గుంటూరులోని రెడ్డిపాలెంలో జరిగింది.

నిద్రిస్తున్న వృద్ధునిపై దాడి చేసిన దుండగులు