గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను మరింత చేరువ చేయాలని వైద్యరంగ సంస్థల కమిటీ సూచించింది. ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులను అందుతున్న వైద్యసేవలు, సమస్యలు అమలుచేయాల్సిన సంస్కరణలుపై ఈ కమిటీ 2 నెలల పాటు చేపట్టిన అధ్యయనం ముగింపునకు చేరింది. 18న తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్‌కు అందజేయబోతుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం
- ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా వైద్యసేవలను ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంచాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టుల్లో పని చేయాలి..మూడో వైద్యుడు రాత్రి పూట విధుల్లో ఉండాలి.
- ఈ కేంద్రాల్లో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా డిప్లోమో ఇన్ హెల్త్ మెడిసిన్ కోర్స్ లేదా పబ్లిక్ హెల్త్‌లో పీజీ వైద్యవిద్య పూర్తిచేయాలి. ఇందుకు నాలుగేళ్ల గడువివ్వాలి.
- రోగులు వైద్యులు వైద్య ఆరోగ్య శాఖద్వారా జరిగే కార్యక్రమాల పర్యవేక్షణకు సమన్వయకర్తను నియమించాలి.
- రోగుల కౌన్సిలింగ్‌కు సామాజిక కార్యకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి.
- పీపీపీ విధానంలో రూ.10 కోట్లతో 22 పథకాలు నడుస్తున్నాయి. వీటి నిర్వహణలో సేవ దృక్పథం కొరవడింది. వీటి కొనసాగింపుపై పునరాలోచించాలి.
- రక్తపరీక్షలు ప్రభుత్వం ద్వారానే జరగాలి. ఎమ్మారై, సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వమే కొనుగులు చేసి రోగులకు సేవలందించాలి.
- ఏపీ వైద్య మౌళిక సదుపాయాల సంస్థ బలహీనంగా ఉంది. దీన్ని బలోపేతం చేయాలి.