గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని... బైకు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడుకు చెందిన నాగరాజు, అతని భార్య యశోద, పిల్లలు రానా, కావ్యలతో కలసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట చర్చికి బయలుదేరారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని నాగరాజు వెనక వైపు నుంచి ఢీ కొట్టాడు. కావ్య మినహా మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆగివున్న లారీని ఢీకొన్న బైకు... ముగ్గురికి గాయాలు - గుంటూరు జిల్లా తిమ్మాపురంలో రోడ్డు ప్రమాదం
ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటన గుంటూరు జిల్లా తిమ్మాపురంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.
లారీకిందకి దూసుకెళ్లిన బైకు