గుంటూరు జిల్లా మాచర్లలో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలుగా ఎలాంటి కేసులు లేకుండా ఉన్న మాచర్లలో సోమవారం కరోనా కేసులు రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
మొదట్లో 13 కేసులు నమోదుకాగా.. 12 మంది కోలుకుని ఇళ్లకు వచ్చారు. ఇప్పటికే పట్టణంలోని మూడు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు కోయంబేడు వెళ్లి వచ్చినట్లు చెబుతున్నారు. ఇతను లారీ డ్రైవర్గా పని చేస్తున్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కాగా... ఓ వృద్ధురాలికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరికి ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వీరితో ఉన్నవారి గురించి వివరాలను సేకరిస్తున్నారు. అనుమానం వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.