గుంటూరు జిల్లా తెనాలిలో ఇసుక టిప్పర్ బీభత్సం సృష్టించింది. తెనాలి పట్టణంలోని వైకుంఠపురం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఇసుక టిప్పర్ ఢీ కొట్టింది.
విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను వారి సోదరుడు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ద్విచక్ర వాహనంపై పెదరావూరు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు వాహనాన్ని కొంత దూరం లాక్కెళ్లింది. బైక్పై వెళ్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.