కృష్ణా నది కరకట్టపై స్కూటీని ఢీకొట్టి కారు... ఇద్దరు మృతి - venkatapalem accident latest news
13:04 June 20
గుంటూరు జిల్లా వెంకటపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణానది కరకట్టపై జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన తండ్రి, కుమారుడు మృతి చెందారు. మైలవరానికి చెందిన కోట మరియదాసు తన భార్య, ఇద్దరు కుమారులతో కలసి స్కూటిపై గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడుకు వెళ్తున్నారు. తుళ్లూరు మండలం మందడానికి చెందిన ఆలూరి చినబాబు కారు కరకట్టపై వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కోట మరియదాసు, కోట ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరియదాసు భార్య, మరో కుమారుడు తేజ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108సిబ్బంది సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాపట్ల ఎంపీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి..
AADHAR,PAN: ఆధార్, పాన్ వివరాలివ్వండి.. రూ. 500 తీసుకెళ్లండంటున్న ముఠా..?