గుంటూరు జిల్లా చిలకలూరిపేట యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి ఐరన్ లోడ్‌తో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా... హర్ష అనే 3 ఏళ్ళ చిన్నారిని గుర్తించారు. అలాగే.. భార్యాభర్తలు పింకీ దాసు, బిదందర్ దాసు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో పాటుగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయాలపాలైన వారంతా తిమ్మాపురంలోని కల్పతరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు.
రోడ్డు ప్రమాద బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం - road accident at guntur latest news
గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఇప్పటికే ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

గుంటూరులో రోడ్డు ప్రమాదం