ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడికొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు కరోనా కేసులు - తాడికొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు కరోనా కేసులు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. కరోనా అనుమానితుల వద్ద అధికారులు నమూనాలు సేకరిస్తున్నారు.

guntur dist
తాడికొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు కరోనా కేసులు

By

Published : Jul 9, 2020, 6:16 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పరిధిలోని ఫిరంగిపురంలో ఇద్దరు, మేడికొండూరులో ఒకరు కరోనా వైరస్ వ్యాధి బారిన పడ్డారు. దీంతో మేడికొండూరు మండలం 12 కేసులు నమోదయ్యాయి. ఫిరంగిపురం మండలంలో ఏడుకు చేరాయి.

మేడికొండూరులో అనుమానితులను గుర్తించి కొవిడ్ 19 పరీక్షలు చేశారు. మండలంలోని పేరిచర్ల చెందిన వ్యక్తి కొద్దిరోజులుగా అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం పేరిచర్లలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వ్యక్తికి కరోనా ఉన్నట్లు మరుసటి రోజు తెలిసింది.. ఒక్కసారిగా అధికారులు స్థానికులు ఉలిక్కి పడ్డారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

ఇదీ చదవండి చెరువు కాదిది.. స్టేడియం..!

ABOUT THE AUTHOR

...view details