గుంటూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం... స్థానికంగా కలకలం రేపింది. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన భోజనపల్లి సత్యశ్రీధర్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య విజయ గౌరి సహాయంగా ఉంటుంది. కరోనా కారణంగా గత ఏడాది నుంచి పనులు లేక శ్రీధర్ పలు చోట్ల అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని భాదితులు అడగడంతో... అప్పుల బాధలు తాళలేక శ్రీధర్, అతని భార్య విజయ గౌరీ, కూతురు లక్ష్మీ ఆశ జ్యోతి... తెనాలి పట్టణంలో ఎలుకలు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
SUICIDE ATTEMPT: అప్పుల బాధ తాళలేక... కుటుంబం ఆత్మహత్యాయత్నం - family have committed suicide in Tenali
గుంటూరు జిల్లా తెనాలిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. అప్పుల బాధలు తాళలేకే వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితులను పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
SUICIDE ATTEMPT
సమాచారం అందుకున్న తెనాలి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. భాదితులకు జీజీహెచ్ లో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి