ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Corona Attack : కుటుంబాన్ని కబలించిన కరోనా మహమ్మారి - Three members of a same family died due to Corona Pandemic in Tenali, Guntur District

కరోనా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. గత నెల 29న ఓ వ్యాపారి అత్త మృతి చెందగా.. అతని భార్య ఐదు రోజుల క్రితం మరణించింది. చివరికి ఆ వ్యక్తి కూడా చిక్సిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు.

3 died with covid
Corona Attack : కుటుంబాన్ని కబలించిన కరోనా మహమ్మారి

By

Published : May 30, 2021, 3:40 AM IST

కొవిడ్ మహమ్మారి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుని బలి తీసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి అత్తమ్మ గత నెల 29న మృతిచెందగా.. అతని భార్య 5 రోజుల క్రితం ప్రాణాలు విడిచింది.

కుమారులు విదేశాల్లో ఉండటంతో...

శుక్రవారం సాయంత్రం ఆ వ్యాపారి చికిత్స పొందుతూ మరణించాడు. దంపతుల కుమారులు విదేశాల్లో ఉండటంతో కడచూపు కోసం మార్చురీలోనే ఉంచారు. అనంతరం సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ప్రతినిధుల సహకారంతో వారి అంత్యక్రియలను పూర్తి చేశారు.

ఇదీ చదవండి:అంబులెన్స్, కారు ఢీ... ఓ వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details