గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట - చీరాల మార్గంలో మండలం ప్రాంతానికి చెెెందిన పసుమర్రు జడ్పీ హైస్కూలు ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పసుమర్రు గ్రామానికి చెందిన ఏడుకొండలు సైకిల్‌పై పట్టణంలో తాగునీరు తెచ్చుకునేందుకు వస్తున్నాడు.
జడ్పీ హైస్కూలు వద్దకు రాగానే చిలకలూరి పేట వైపు నుంచి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై చీరాల వైపు వస్తున్న సాంబశివరావు, మస్తాన్‌రావు.. ఏడుకొండలు సైకిల్‌ను ఢీకొట్టారు. ముగ్గురూ రహదరిపై పడిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.