ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 47వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండటంతో... అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం 3 గేట్లు ఎత్తి 63 వేల 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత 45.15 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి వరద పెరుగుతుండటంతో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశముంది.
పులిచింతలకు భారీ వరద... దిగువకు నీటి విడుదల - పులిచింతల జలాశయం గేట్లు ఎత్తివేత
పులిచింతల జలాశయానికి భారీగా వరద వస్తోంది. అప్రమత్తమైన అధికారులు... ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులిచింతల జలాశయం