ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాండురంగాపురం బీచ్‌కు కొట్టుకువచ్చిన మూడు మృతదేహాలు - పాండురంగాపురం బీచ్‌ వార్తలు

గుంటూరు జిల్లా బాపట్ల మండలం పాండురంగాపురం బీచ్‌లో ముగ్గురు యువకుల మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. మృతులు ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు.

three dead bodies at Pandurangapuram beach
పాండురంగాపురం బీచ్‌కు కొట్టుకువచ్చిన మూడు మృతదేహాలు

By

Published : Jul 4, 2021, 10:03 AM IST

Updated : Jul 4, 2021, 12:22 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం రామచంద్రపురం వద్ద సముద్రతీరంలో.... రెండు రోజుల క్రితం గల్లంతైన.... ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సురేష్ అనే వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఈ రోజు ఉదయం సూర్యలంక తీరంలో రామకృష్ణ, పాండురంగాపురం తీరం ఒడ్డున బ్రమ్మయ్య మృతదేహాలు దొరికాయి. మృతులు ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం వాసులని పోలీసులు తెలిపారు. రామకృష్ణ అనే యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. ఎనిమిది మంది స్నేహితులు కలిసి సముద్రంలో దిగగా.... ముగ్గురు గల్లంతయ్యారు.ముగ్గురి మరణంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.

Last Updated : Jul 4, 2021, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details