మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేస్తున్నవారిలో కొందరు చంద్రబాబు వాహనశ్రేణిని అడ్డగించేందుకు యత్నించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉద్దండరాయునిపాలెంలోని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాయపూడికి వెళ్తున్న సమయంలో కొంత మంది వ్యక్తులు బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఆపారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేవరకు వారిని కట్టిడి చేసిన పోలీసులు అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు వాహనం అడ్డగింతకు యత్నం - చంద్రబాబును అడ్డుకున్న మూడురాజధానుల నిరసనకారులు
గురువారం ఉద్దండరాయునిపాలెం నుంచి జనభేరి సభకు వెళ్తున్న చంద్రబాబును మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేస్తున్నవారి అడ్డుకునేందుకు యత్నించారు. రహదారిపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఆపారు.
three capital agitators tried to stop chandra babu convey
బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న తాము చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారని ఎస్‌డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గురునాథం తెలిపారు.
ఇదీ చదవండి :జనభేరి...అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి