ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధం తెలిసిపోయిందని భర్తను చంపేసిన భార్య!

ఈనెల 22న తెనాలిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని తేల్చిన దర్యాప్తు సిబ్బంది... హతుడి భార్యే ప్రధాన ముద్దాయి అని నిర్దరణకు వచ్చారు. ఆమెతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

చంద్రానాయక్ హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
చంద్రానాయక్ హత్యకేసులో ముగ్గురి అరెస్ట్

By

Published : Oct 27, 2020, 2:31 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో ఈనెల 22న జరిగిన చంద్రానాయక్ హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హతుడి భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెనాలి అదనపు ఎస్పీ లక్ష్మి తెలిపారు. సుల్తానాబాద్​కు చెందిన చంద్రానాయక్​కు జ్యోతి భాయితో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఏడాది క్రితం శివనాగార్జున అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై చంద్రానాయక్​కు అనుమానం వచ్చి భార్యను, శివను నిలదీశాడు.

విషయం తెలిసిపోయిన చంద్రనాయక్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు శివ, జ్యోతి. దీనికి జ్యోతి అక్క కుమారుడు సాయి కుమార్ సాయం తీసుకున్నారు. ఈనెల 22న రాత్రి సమయంలో జ్యోతి ఇంటి తలుపులు తీసే ఉంచింది. శివనాగార్జున, సాయికుమార్​తోపాటు మరో ఇద్దరు కలిసి చంద్రనాయక్​ నిద్రిస్తున్న సమయంలో కత్తులతో పొడిచి చంపారు. సాయికుమార్ ఒక్కడే చంద్ర నాయక్​ను చంపినట్లు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటల్లో తేడా గుర్తించిన పోలీసులు.. లోతుగా విచారించి వాస్తవాలు రాబట్టారు.

చంద్రనాయక్​ను హత్య చేసిన సాయికుమార్, చంపేందుకు కుట్ర పన్నిన జ్యోతితోపాటు సహకరించిన శివను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

ద్విచక్రవాహనం ఢీకొని.. ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details