ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో...ముగ్గురు విద్యార్థుల అదృశ్యం - గుంటూరు జిల్లా సత్తెనపల్లి

సత్తెనపల్లెలోని ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

సత్తెనపల్లిలో...ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

By

Published : Jul 27, 2019, 11:41 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని నాగార్జున నగర్ పార్క్ సెంటర్ సమీపంలో నివసిస్తున్న... కట్టా గోపీచంద్, గుర్రం వెంకటకృష్ణ, షేక్ మహబూబ్ సుభానిలు ప్రగతి టాలెంట్ స్కూల్​లో చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్ళినవారు తిరిగి ఇంటికి రాకపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details