ప్రైవేట్ పాఠశాలలపై అధికారుల కొరడా - విద్యా
ప్రైవేట్ పాఠశాలలపై విద్యా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల ఫిట్ నెస్ సామర్థ్యం పై కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలను పరిశీలిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలలపై విద్యా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు .గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఎంఇఓ రమాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేల పుస్తకాలు పాఠశాలల పేర్లతో సహా ముద్రించి విద్యార్థులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. దాదాపు 10 వేల పుస్తకాలను అధికారులు సీజ్ చేశారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో భారీ స్థాయిలో పుస్తకాల వ్యాపారం జరుగుతోందని... విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్ నెస్ సామర్థ్యంపై కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.