కరోనాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే 21 కేసులు రావటంతో నియంత్రణ చర్యలు మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా చర్చించారని తెలిపింది. దిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు పంపాలని సీఎం ఆదేశించారని బులెటిన్‌లో పేర్కొంది. వారి సన్నిహితులు, బంధువుల సమాచారాన్ని ఆరా తీస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే దిల్లీ వెళ్లివచ్చిన వారి ఇళ్ల ప్రాంతాలను సున్నితమైనవిగా ప్రకటించాలని సీఎం చెప్పారని... దిల్లీ నుంచి వచ్చిన అందరినీ గుర్తించే కార్యక్రమం చేపట్టినట్టు వైద్యశాఖ వెల్లడించింది. 31 వేల మందిని సర్వే లిస్టులో పెట్టినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. కడప, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ నుంచి వివరాలు సేకరించినట్లు వివరించింది.
వారందరినీ క్వారంటైన్‌కు పంపండి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీలో మత ప్రార్థనలకు హాజరై రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలను ఆరా తీస్తోంది. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు పంపాలని సీఎం జగన్ ఆదేశించారు.
cm jagan
Last Updated : Mar 31, 2020, 11:44 PM IST