గుంటూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురజాల రెవెన్యూ డివిజన్లోని 36 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు గుర్తించి.. అక్కడ అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం - guntur panchayati elections latest news
గుంటూరు జిల్లాలో ముడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో.. బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే పాల్వాయి, ధర్మవరం, తుమ్రుకోట గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రామానికి ఒక డీఎస్సీని నియమించారు. గురజాల నియోజవకర్గంలో 33 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఓటర్లకు చేతులు శానిటైజ్ చేసి పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారు. ఓటర్లకు మాస్కులు తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్: 8.30 కి 11.90 పోలింగ్ శాతం నమోదు