.
తెనాలిలో ఆభరణాలు దొంగిలించిన ముఠా అరెస్ట్ - thieves was arrested in gold robbery case at thenali guntur dst
గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. 11 మందిని అరెస్ట్ చేసి నిందితుల నుంచి 18 లక్షల 9వేలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18వ తేదీన తెనాలిలోని డిలైట్ అపార్ట్మెంట్లో దోపిడి జరిగింది. చదలవాడ శ్రీనివాసరావుకు చెందిన బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి నగదు ఇప్పిస్తామని నిందితులు తెలివిగా నమ్మించారు. అతను అపార్టుమెంటుకు వచ్చిన వెంటనే కర్రలతో దాడి చేసి ఆభరణాలు గుంజుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
తెనాలిలో నగదు దొంగిలించిన ముఠా అరెస్ట్ చేసిన పోలీసులు