గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పల్లపు రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 240 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ అదనపు ఎస్పీ మూర్తి తెలిపారు.
రోడ్డుమీద దొంగ చూపులు చూస్తూ తిరిగాడు.. పోలీసులకు డౌట్ వచ్చి చూస్తే...
ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని.. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. సత్తెనపల్లిలో నివాసం ఉండే రవి టైలర్. వ్యవసానాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించాలని.. ఒంటరిగా ఉండే మహిళల నివాసలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిన్న రాత్రి సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. విచారణలో.. నిందితుడుపై 9 పైగా కేసులు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.
ఇదీ చదవండి: Lady police : గంజాయి తోటల్ని ధ్వంసం చేసిన మహిళా పోలీస్..అధికారుల అభినందనలు