ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నడికుడి ప్రశాంతంగా ఉంది...వదంతులు నమ్మొద్దు' - Guntur district latest news

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో ఎలాంటి వింత వ్యాధి లేదని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. నీటి కాలుష్యం జరుగుతోందని తేలితే అక్కడి రసాయన పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

mla kasu brahmananda reddy
mla kasu brahmananda reddy

By

Published : Dec 13, 2020, 9:07 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో పలువురు స్పృహ తప్పి పడిపోతుండటం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. నడికుడిలో ఎలాంటి వింత వ్యాధి లేదని... వదంతులు నమ్మవద్దని అన్నారు. అస్వస్థతకు గురైన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఆయన వెల్లడించారు. అతనికి అన్ని పరీక్షలు చేస్తే సాధారణం అని వచ్చిందని చెప్పారు.

మరోవైపు రసాయన పరిశ్రమ వల్ల నీరు కలుషితం అవుతుందన్న విషయంపై డీఆర్సీ సమావేశంలో చర్చించామని ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై కమిటీ వేసి విచారిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలు పాడు చేసే ఏ పరిశ్రమనూ ఉపేక్షించమని ఆయన చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details