రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ మండిపడ్డారు. వారి అరాచకాలకు తాను ఒక బాధితుడినేనని వాపోయారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడితోనే తమ కుటుంబంపై సాక్ష్యాలు లేని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ముసుగులో అసాంఘిక శక్తులు దాడులు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు.
వైకాపా ఒత్తిడితోనే సాక్ష్యాలు లేని కేసులు: కోడెల - kodela
రాష్ట్రంలో వైకాపా శ్రేణుల ఆగడాలు శృతి మించుతున్నాయని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ విమర్శించారు. ప్రతి సంఘటనను ప్రజలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినపుడు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కోడెల