Amaravati farmers padayatra: అమరావతి రైతుల పాదయాత్ర పునః ప్రారంభంపై ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పాదయాత్రలో 2వేల మంది రైతులకు అనుమతి ఇవ్వాలంటూ రైతులు వేసిన మరో పిటిషన్... నేడు హైకోర్టు డివిజన్ బెంచి ముందు విచారణకు రానుంది. రాజధాని కోసం భూములిచ్చిన వారందరికీ.. పాదయాత్ర చేసే హక్కు ఉంటుందని రైతులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో వచ్చే ఆదేశాలను బట్టి పాదయాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయిస్తారు. ఒకవేళ 600మందికే అనుమతించినా పాదయాత్ర పునప్రారంభమవుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. మంచిరోజు చూసుకుని పాదయాత్ర ఆగిన చోటి నుంచే ఈనెల 5 లేదా 7తేదీల్లో పాదయాత్ర మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Amaravati padayatra: పాదయాత్ర పునః ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం - అమరావతి తాజా వార్తలు
Amaravati farmers padayatra: అమరావతి రైతుల పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడంపై ఇవాళ స్పష్టత వచ్చేవీలుంది. రైతులు వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించనుంది.
పాదయాత్ర