గుంటూరు జిల్లా నగరం మండలంలోని మీసాలవారి పాలెం, గూడపాటి వారి పాలెంలోని అభయాంజనేయ స్వామి ఆలయాల్లో హుండీలు అపహరణకు గురయ్యాయి. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు హుండీలు దొంగిలించారు. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరిచిన పూజారులు... హుండీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నగరం మండలంలోని రెండు ఆలయాల్లో హుండీల చోరీ - guntur district latest news updates
గుంటూరు జిల్లా నగరం మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెండు ఆలయాల్లో హుండీలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ఆలయాల్లో చోరీకి గురైన హుండీలు
Last Updated : Jan 3, 2021, 8:19 PM IST