గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందివెలుగు అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామీణ పోలీస్‌స్టేషన్ ఎస్సై ప్రసన్నకుమార్, ఆలయ అధికారులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని శివాలయంలో అంతర ఆలయంగా అమ్మవారి గుడి ఉంది. దీని వెనుక తోటల వైపు నుంచి ఉన్న రెండో తలుపు ద్వారా గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి వచ్చాడు. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి మకర తోరణం, శఠగోపాలతో సహా సర్వాభరాణాలను మూట కట్టుకున్నాడు. తిరిగొచ్చిన దారిలోనే పరారయ్యాడు.
చోరీకి పాల్పడిన వ్యక్తి కదలికలు ఆలయంలో ఉన్న నిఘా కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇతనికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉంటుందని, కుంటుతూ నడుస్తున్నాడని పోలీసులు చెప్పారు. తెల్లవారుజామున గం.1.30కు ఆలయంలోకి వచ్చిన ఈయన గం.3.30 వరకు అక్కడే ఉన్నాడు. ఆభరణాలు తీసుకువెళుతున్న క్రమంలో త్రిశూలం, చెయ్యి వంటి ఆరు రకాల ఆభరాణాలు గుడి ఆవరణలో, తోటలో పడిపోగా పోలీసులు, ఆలయ అధికారులు వాటిని గుర్తించి తీసుకువచ్చారు.