ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో దొంగల బీభత్సం

గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో దొంగలు హల్​చల్ చేశారు. రైల్వే మహిళా గార్డును బెదిరించి నగలు దోచుకున్నారు.

heft  in goods trains at tadepalli krishna cannal railway junction
కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో దొంగల బీభత్సం

By

Published : Mar 31, 2021, 2:08 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్వే మహిళా గార్డును బెదిరించి దుండగులు నగలు అపహరించారు. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్తున్న గూడ్స్ రైలు.. కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో సిగ్నల్ కోసం ఆగింది. ఆ సమయంలో రైలు వెనుక భాగంలో గార్డు పెట్టెలోకి దుండగులు ప్రవేశించారు. ఒంటరిగా ఉన్న మహిళా గార్డును బెదిరించి నగలు అపహరించారు. ఈ ఘటనపై మహిళా గార్డు.. ఆర్పీఎఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details