గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ మందుల దుకాణంలో చోరీ జరిగింది. తెల్లవారు జామున 2గంటల సమయంలో దుకాణం వెనుకవైపు పైభాగంలో రేకులు కోసి దుండగులు లోపలికి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న సుమారు 30వేల నగదును అపహరించినట్లు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. దుకాణదారులు పోలీసులకు సమాచారం అందించటంతో క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు. పాత నేరస్థులే ఈ పనికి పాల్పడి ఉంటారని పోలిసులు భావిస్తున్నారు. త్వరలోనే నేరస్థులను పట్టుకొని చర్యలు తీసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
మందుల దుకాణంలో చోరీ..30 వేల నగదు మాయం - tadepalli, guntur
గుంటూరు జిల్లాలోని ఓ మందుల దుకాణంలో చోరి జరిగింది. దుకాణంలో ఉన్న నగదును దొంగలు అపహరించినట్లు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.
మందుల దుకాణంలో చోరి