ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు!

ఓ విశ్రాంత హెచ్ఎంను ఇద్దరు దుండగులు ఏమార్చి నగదు తీసుకుని ఉడాయించిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. సీసీ టీవీ దృశ్యాల అధారంగా... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

theft at chilakaluripeta in guntur district
డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు

By

Published : Feb 17, 2021, 4:42 PM IST

Updated : Feb 17, 2021, 5:25 PM IST

డబ్బులు కింద పడ్డాయని చెప్పి... నగదు కాజేశారు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం ఎన్ఆర్​టీ సెంటర్​లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో రూ. 35,000 డ్రా చేసి వస్తున్న ఓ విశ్రాంత హెడ్మాస్టర్​ను.. దుండగులు ఏమార్చి నగదు దోచుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమ పట్నం గ్రామానికి చెందిన శారద ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం తోట ఆంజనేయులు బుధవారం ఎస్​బీఐ బ్యాంకులో నగదు డ్రా చేశాడు.

సైకిల్ మీద పెట్టుకొని ఎన్ఆర్​టీ సెంటర్లో మున్సిపల్ కార్యాలయం మలుపు తిరుగుతున్నాడు. ఇది గమనించిన దుండగులు ఆంజనేయులు వద్దకు వచ్చి మీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పడంతో అతను సైకిలు పక్కనపెట్టి ఆ డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. ఈలోగా మరో వ్యక్తి సైకిల్ మీద వెనుక స్టాండ్​పై ఉంచిన నగదు తీసుకొని ద్విచక్రవాహనంపై ఉడాయించారు.

Last Updated : Feb 17, 2021, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details