గుంటూరు జిల్లా నరసారావుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వం మద్యం దుకాణంలో చోరీ జరగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 22న దేశవ్యాప్తంగా విధించిన జనతా కర్ఫ్యూ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. ఆ సమయంలో దుకాణంలో 50 లక్షల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్లు అధికారులకు నివేదిక అందింది. అయితే గత నెల 26న దుకాణంలో చోరీ జరగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో దుకాణంలోని సీసీ కెమరాలను పని చేయకుండా చేసి చోరీకి పాల్పడగా...సమీపంలోని లాడ్జ్‌కు సంబంధించిన సీసీ కెమరాల్లో దుండగుల కదలికలు రికార్డయ్యాయి. చోరీ ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ...5 లక్షల విలువైన మద్యం అపహరణ ! - గుంటూరులో లక్షల విలువైన మద్యం అపహరణ
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీకి పాల్పడి 5 లక్షల విలువైన మద్యం అపహరించిన ఘటన గుంటూరు జిల్లా నరసారావుపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా...విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ