Theft in Guntur Chilli Company : గుంటూరులోని మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ దొంగతనం జరిగింది. ఈ చోరీలో దుండగులు సుమారు 20 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్న సమయంలో ఘటనాస్థలంలోని కాపల కుక్క అరవకుండా.. వారితో పాటు తెచ్చుకున్న చికెన్ ముక్కలను వేశారు. చోరీ అనంతరం ద్విచక్రవాహనంపై పరారయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటప్పయ్యకాలనీ లాల్‌పురంరోడ్డు చివర చోరీ జరిగిన మిర్చి ఎగుమతుల కంపెనీ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాతో పాటు ఇతర ప్రాంతాలకు భారీ మొత్తంలో మిర్చి ఎగుమతి చేస్తుంటారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై.. మిర్చి ఎగుమతి కంపెనీ వద్దకు వచ్చారు. వారు వచ్చిన వాహనశబ్దం విన్న కంపెనీ వాచ్మెన్ ఏవరని అరిచాడు. దీంతో వాచ్‌మెన్‌ను పట్టుకుని.. చేతులను తాళ్లతో కట్టేశారు. అరిస్తే చంపుతామని బ్లేడ్ చూపించి అతనిని బెదిరించారు.
కుక్కకు చికెన్ ముక్కలు వేసి.. నగదుతో ఉడాయింపు - Guntur Theft News
Theft in Guntur : గుంటూరులోని ఓ మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీ చేస్తుండగా కంపెనీ దగ్గర కాపలా ఉన్న కుక్క అరవకుండా.. దొంగలు చికెన్ ముక్కలు విసిరి పరారయ్యారు.
ఒక వ్యక్తి వాచ్మెన్ దగ్గర ఉండగా.. మరో వ్యక్తి కంపెనీ ద్వారానికి ఉన్న తాళాన్ని కోసి లోపలికి వెళ్లాడు. కంపెనీ గదిలో ఉన్న కప్బోర్డు తాళాన్ని కోసి అందులోని నగదును అపహరించుకుపోయారు. వారు బయటకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న కుక్క అరిచింది. దాని అరుపులు ఆపేందుకు వారు తమ చికెన్ ముక్కలను వేసి అక్కడినుంచి ద్విచక్రవాహనంపై పారిపోయారు. రూ.20 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లారని కంపెనీ యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నగరపాలెం సీఐ హైమరావు తెలిపారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం, నేర విభాగ పోలీసులు అధారాలు సేకరించారు. అదే కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: